Nimmagadda Ramesh Kumar To Meet AP Governor: గవర్నర్‌తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ
Nimmagadda Ramesh Kumar To Meet AP Governor: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ను మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిశారు. తన తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించాలని గవర్నర్ ను కోరారు.
Nimmagadda Ramesh Kumar To Meets AP Governor: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ను మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిశారు. తన తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించాలని గవర్నర్ ను కోరారు. ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఈసీగా నిమ్మగడ్డను తొలగించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. దీంతో ఈసీ పదవిలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డను నియమించకపోవడంతో ఆయన మల్లి కోర్టును ఆశ్రయించడంతో గవర్నర్ ను కలవాలని హైకోర్టు సూచన మేరకు నిమ్మగడ్డ ఇవాళ గవర్నర్ ను కలిశారు. కాగా నిమ్మగడ్డకు అనుకూలంగా వచ్చిన తీర్పుపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించడమే కాకుండా నిమ్మగడ్డను ఎందుకు పునర్నియమించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేయడం, అధికారులను బదిలీ చేయడం వంటివి చేయడంతో నిమ్మగడ్డపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు నిమ్మగడ్డ కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కేంద్ర హోమ్ శాఖకు లేఖ రాయడం, అందులో ఎన్నికల్లో డబ్బు మద్యం పంపిణీకి వ్యతిరేకంగా ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ను తప్పుబట్టడం.. దానిని ఆయన క్రూరమైన ఆర్డినెన్స్ అంటూ సంబోధించడం పెద్ద దుమారం రేపింది. దీంతో నిమ్మగడ్డను తప్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకు వచ్చినా హైకోర్టు దీనిని కొట్టివేసింది.