పోలవరం నిర్మాణంలో సరయిన జాగ్రత్తలు తీసుకోవడంలేదని ఎన్జీటీ తీవ్రవ్యాఖ్యలు చేసింది. పర్యావరణ ప్రణాళికలను లోపభూయిష్టిగా రూపొందించారని వ్యాఖ్యానించిన ఎన్జీటీ.. సమస్యలు పదే పదే ఉత్పన్నం అవడానికి అదే కారణమని సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఉత్తరాఖండ్‌లో జరిగిన ప్రళయం ఏపీలోనూ జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నిపుణుల కమిటీ నిర్దేశాల ప్రకారం పర్యావరణ ప్రణాళిక అమలు చేయాలని సూచించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఎన్జీటీ కమిటీని నియమించనుంది.