పశ్చిమగోదావరిలో మళ్లీ వచ్చిన వింత వ్యాధి
*పూళ్ల గ్రామంలో భయాందోళనలు *వింత వ్యాధితో పంట పొలాల్లో పడిపోతున్న రైతులు *ముగ్గురు రైతులను ఆస్పత్రికి తరలించిన స్థానికులు
పశ్చిమగోదావరి జిల్లాలో మళ్లీ వింత వ్యాధి కలకలం రేపింది. పూళ్ల గ్రామంలో వింత వ్యాధితో ప్రజలు కింద పడిపోతున్నారు. పంట పొలాల్లో ముగ్గురు రైతులు పనిచేస్తూచేస్తూ పడిపోవడంతో వాళ్లను ఆస్పత్రికి తరలించారు. దాంతో, పూళ్ల గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. గడిచిన రెండు రోజుల్లో అనారోగ్యానికి గురయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నడిచే వారు నడుస్తున్నట్టు నిలుచున్న వారు నిలుచున్నచోటే కుప్ప కూలిపోవడం, ఫిట్స్‌తో కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపించడంతో వింత వ్యాధేమోనన్న భయంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.