Rajya Sabha MPs Oath: నేడు రాజ్యసభ సభ్యుల ప్రమాణం
Rajya Sabha MPs Oath: ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నలుగురు సభ్యులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Rajya Sabha MPs Oath: ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నలుగురు సభ్యులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నాలుగు రాజ్యసభ పభ్యుల్లో అనూహ్యంగా మోపిదేవి. చంద్రబోస్ తెరపైకి వచ్చారు. వాస్తవంగా వీరు శాసన మండలి సభ్యులు కాగా, మంత్రులుగా నియమించారు. అయితే వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకించడంతో శాసనమండలి రద్దుకు సిఫార్సు చేస్తూ ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో వీరిద్దరికీ సభ్యత్వం రద్దవుతుందనే కారణంగా రాజ్యసభకు పంపించారు. అయితే తరువాత మరికొంత మందిని శాసనమండలికి వైఎస్ జగన్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా వీరు రాజ్యసభకు ఎన్నిక కాగా మరో ఇద్దరు అయోద్య రామిరెడ్డి, పరిమళ్ సత్వానీలను రాజ్యసభకు ఎంపిక చేశారు. అయితే వీరిలో ఈ రోజు రామిరెడ్డి ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధంకాగా మరో ఎంపీ సత్వానీ వ్యక్తిగత కారణాల వల్ల వాయిదా వేసుకున్నారు.
ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, అయోధ్య రామిరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో సభ్యుడు పరిమళ్ నత్వానీ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నారని, మరోరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. 20 రాష్ట్రాల నుంచి మొత్తం 61 మంది సభ్యులు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరిలో చాలామంది నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు సామాజిక దూరం పాటించాల్సి ఉన్నందున సభలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.