విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కొత్త ట్విస్ట్
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కొత్త ట్విస్ట్ ఇచ్చింది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ మిగులు భూముల్లో పోస్కో స్టీల్ కంపెనీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఉక్కుశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు రాజ్యసభలో కేంద్ర ఉక్కుమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిచ్చారు. పోస్కో-ఆర్‌ఐఎస్‌ఎల్ మధ్య ఈ మేరకు 2019 అక్టోబర్‌లో ఎంవోయూ జరిగిందని తెలిపారు.
మరోవైపు విశాఖ ఉక్కు పై ఏపీలో ఉద్యమం తీవ్రతరం అవుతోంది. అన్ని పార్టీ కేంద్రప్రభుత్వాతికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఏపీ సీఏం జగన్ కూడా విశాఖ ఉక్కు కార్మాగారం విషయంలో కేంద్రానికి లేఖ రాశారు. మరోవైపుపవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్ మంగళవారం రాత్రి హోంమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వినతి పత్రం సమర్పించారు.