Vijayawada: పోలీస్ క్రైమ్ కథా చిత్రమ్
Vijayawada: కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఆ విషయం బయటపడకుండా ఉండేందుకు పోలీసు తెలివి చూపించాడు తనకేమీ సంబంధం లేనట్టుగా కట్టుకథ అల్లాడు.
Vijayawada: కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఆ విషయం బయటపడకుండా ఉండేందుకు పోలీసు తెలివి చూపించాడు తనకేమీ సంబంధం లేనట్టుగా కట్టుకథ అల్లాడు. అయినా కథ అడ్డం తిరిగింది. మూడేళ్ల కాపురం కాస్తా మూడు క్షణాల్లో ముగిసిపోయింది. పచ్చని జీవితం దు:ఖమయం అయ్యింది. క్షణికావేశంతో ఛిన్నాబిన్నమైంది హోంగార్డు లైఫ్ స్టోరీ.
విజయవాడ గొల్లపూడి మౌలానగర్‌లో నివాసం ఉంటున్న హోం గార్డు వినోద్ దంపతుల మద్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. గత రాత్రి కూడా ఇద్దరూ మళ్లీ తగువు పెట్టుకున్నారు. ఈ గొడవలో వినోద్ ఆవేశంతో భార్యపై కాల్పులు జరిపాడు. తుపాకి శబ్ధం కావడంతో చుట్టు పక్కల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొదట ఇంట్లో మిస్ ఫైర్ అయి తన భార్య చనిపోయిందని క్రియేట్ చేశాడు. పోలీసులను, బంధువులకు అదే చెప్పాడు. వారు కూడా వినోద్ చెప్పిందే నిజమని నమ్మారు. అయితే ఘటనపై కేసు నమోదు చేసిన భవానీపురం పోలీసులు విచారణ మొదలు పెట్టారు అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హోంగార్డు వినోద్ క్షణికావేశంలో భార్యను హతమార్చినట్లు నిర్ధారణైంది.
తూర్పు గోదావరి జిల్లా అన్నవరకు చెందిన వినోద్ సీఎం సెక్యూరిటీ వింగ్ ఏఎస్పీ శశిభూషణ్ దగ్గర అసిస్టెంట్‌గా హోంగార్డ్ విధులు నిర్వహిస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం విశాఖకు చెందిన రత్నప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరిని చూసిన ఇరుగుపొరుగువారు కూడా ఎంతో ముచ్చటైన జంట అంటూ చెప్పుకునేవారు. కానీ వీరద్దరి మధ్య ఎవరికి తెలియని కోణం ఒకటి ఒక్కసారిగా బయటపడింది. బంగారు నగల తాకట్టు విషయంలో చాలాకాలంగా గొడవ జరుగుతుంది. డ్యూటీ నుంచి వచ్చి తర్వాత మరోసారి గొడవ జరిగింది. అయితే తన భార్యను బెదిరించే క్రమంలో తన దగ్గర ఉన్న తుపాకీతో ఫైరింగ్ చేశాడు. తుపాకీ గుండు సరాసరి భార్య రత్నప్రభ గుండెల్లో దిగింది అంతా క్షణాల్లో జరిగింది.
ఏఎస్పీ శశి భూషణ్ కు చెందిన అధికారిక 9 ఎంఎం పిస్టల్ తో వినోద్ కాల్పులు జరిపాడని విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. చేతి నుంచి ఛాతీ లోపలగా తూటా బయటకు వచ్చిందని గుర్తించామన్నారు. ఒక బులెట్ మాత్రమే కాల్పుల్లో వాడాడని ఏఎస్పీ వెపన్ హోం గార్డు దగ్గర వదిలి వెళ్లటంపై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు సీపీ.
చిలకా గోరింకల్లా మూడేళ్ళు జీవించిన ఆ భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ క్షణికావేశం నూరేళ్ళ జీవితాన్ని బలితీసుకుంది. ఒకరిని ఈ లోకం నుంచి పంపేసింది ఒకరి జీవితం ఛిన్నభిన్నం చేసింది. ఇంతకీ కారణమైన ఆయుధం వాడకంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో పోలీసులు తేల్చాల్సి ఉంది.