Clinical Fume Respiratory Mask: మాస్క్ లందు ఫిల్టర్ మాస్క్ వేరయా...
Clinical Fume Respiratory Mask: మాస్క్ పెట్టుకున్న వ్యక్తిని చూస్తే విచిత్రంగా చూసేవారు జనం..
Clinical Fume Respiratory Mask: మాస్క్ పెట్టుకున్న వ్యక్తిని చూస్తే విచిత్రంగా చూసేవారు జనం... పదేళ్ల క్రితం స్వైన్ ప్లూ వ్యాధి వచ్చినప్పుడు ఆస్పత్రులు, విమానాశ్రాయాల వద్ద మాస్క్ సర్జికల్ మాస్క్ వాడేవారు. వీటిని అందరూ పూర్తిస్థాయిలో వాడేవారు కాదు. ఇక కరోనా పుణ్యమాని అందరూ వాడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిలోనూ రకరకాల మాస్క్ లు. క్లాత్ మాస్క్, సర్జికల్ మాస్క్, ఎన్ - 95 మస్క్, కొత్తగా క్లినికల్ ఫ్యూమ్ రెస్పిరెటరీ మాస్క్. దీని ధర ఎక్కువగానే ఉంటున్నా, సేఫ్టీ విషయంలోనూ మరింత ముందుంటుంది.
ఇలాంటి రెండు ఫిల్టర్లున్న కొత్తరకం మాస్క్ తో విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్యకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి.సుధాకర్ ధరించారు. హాఫ్ ఫేస్ పీస్ గా పిలిచే ఈ మాస్క్ అసలు పేరు క్లినికల్ కెమికల్ ఫ్యూమ్ రెస్పిరేటరీ మాస్కు. దీన్ని ధరించడంలో కొంత అసౌకర్యం ఉన్నా.. పూర్తి రక్షణాత్మకమైనదని సుధాకర్ తెలిపారు. దీనికి రెండు వైపులా ఉన్న ఫిల్టర్లను నెల రోజులపాటు ఏకధాటిగా వాడొచ్చు. నెల తర్వాత కొత్తవి అమర్చుకోవాలి. అమెరికా నుంచి సన్నిహితులు పంపారని, దేశీయ మార్కెట్ లో దీని ధర రూ.6 వేల వరకు ఉంటుందని సుధాకర్ వివరించారు.