తెలుగు రాష్ట్రాల్లో స్ట్రెయిన్ కలకలం

* అప్రమత్తమయిన అధికార యంత్రాంగం * యూకే నుంచి వచ్చిన రాజమండ్రి మహిళకు పాజిటివ్ * ఢిల్లీ క్వారంటైన్‌ నుంచి తప్పించుకున్న మహిళ * ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కి రాజమండ్రికి చేరుకున్న మహిళ * సమాచారం తెలియగానే అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

Update: 2020-12-24 10:58 GMT

యూకె, బ్రిటన్ దేశాలను వణికిస్తున్న కరోనా స్ట్రెయిన్ తెలుగు రాష్ట్రాల్లోకీ ఎంటరైందా..? ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో కొత్తరకం కరోనా కలవరానికి గురిచేస్తోంది. యూకే నుంచి వచ్చిన రాజమండ్రి చెందిన మహిళకు పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో లండన్ నుంచి ఢిల్లీ చేరుకున్న ఆ మహిళను ఎయిర్‌పోర్టు అధికారులు క్వారంటైన్‌లో ఉంచారు. అయితే ఆమె తప్పించుకొని ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కి రాజమండ్రికి చేరుకుంది. విషయం తెలుసుకున్న ఏపీ వైద్య అధికారులు ఆమె ఇంటికి చేరుకొని అస్పత్రికి తరలించారు. ఆమె కుమారుడిని కూడా క్వారంటైన్‌లో ఉంచారు.

మరోవైపు.. లండన్ నుంచి వచ్చిన మహిళతో పాటు ఆమె కుమారుడికి ఇవాళ మరోసారి టెస్టులు నిర్వహించనున్నారు. రక్తనమూనాలను సేకరించి, పుణెల్యాబ్‌కు పంపించనున్నారు. జన్యు మార్పిడి చెందిన వెరస్సా.. లేదా పాత కరోననా అని నిర్ధారించనున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు ప్రత్యేక ఐసోలేషన్‌ గదులను ఏర్పాటు చేశారు.

ఇటు.. తెలంగాణలోని కరీంనగర్ లోనూ కొత్తరకం స్ట్రెయిన్ కలవరపెడుతోంది. ఇటీవల బ్రిటన్ నుంచి కరీంనగర్ చేరుకున్న వారిపై అధికారులు నిఘా పెంచారు. గత పదిరోజులు వ్యవధిలో బ్రిటన్ నుంచి 16 మంది కరీంనగర్, పెడ్డపల్లి, వరంగల్ జిల్లాలకు చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో పదిమంది నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపించినట్లు జిల్లా వైద్య అధికారిణి సుజాత స్పష్టం చేశారు. మరో నలుగురు పెద్దపల్లి జిల్లాలకు చెందినవారు కావడంతో అక్కడి అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. మరొకరు వరంగల్ జిల్లాకు చెందిన వారు కాగా.. ఇంకొకరు తిరిగి ఇంగ్లండ్ వెళ్లిపోయినట్లు వివరించారు. ప్రస్తుతం ఇంగ్లండ్ నుంచి వచ్చిన వారిని ఎక్కడివారు అక్కడే ఉండాల్సిందిగా ఆదేశించినట్లు సుజాత తెలిపారు.

Tags:    

Similar News