నెల్లూరు ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేత

Ayurvedic Medicine For COVID-19: అయితే దీనికి ఇంకా అధికారికంగా ఆమోదముద్ర పడలేదు. ఆయుష్ కూడా ఇంకా ఏ విషయం చెప్పలేదు.

Update: 2021-05-21 14:00 GMT

Nellore Ayurvedic medicine 

Ayurvedic medicine For COVID-19: కరోనా వైరస్ రాష్ట్ర వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తోంది. క‌రోనా వైర‌స్ దాటికి ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావాలంటేనే జంకుతున్నారు. ఒక వైపు క‌రోనాకు అడ్డుక‌ట్ట వేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతంది. ఈ నేప‌థ్యంలో కృష్ణపట్నం పసరు మందు పని చేస్తుందనే కబురు అందటంతో వారంతా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు పరుగులు పెడుతున్నారు. కరోనాబారిన పడి బతుకుతామనే నమ్మకం లేనోళ్లంతా అటువైపు వెళుతున్నారు. ఆనందయ్య అనే వ్యక్తి ఈ పసరు ముందును జిల్లేడు పువ్వులు, వేపాకు, ఉమ్మెత్త పువ్వులతో కలిపి చేస్తున్నారు.

అయితే దీనికి ఇంకా అధికారికంగా ఆమోదముద్ర పడలేదు. ఆయుష్ కూడా ఇంకా ఏ విషయం చెప్పలేదు.దీనిపై సీఎం జగన్ కూడా దృష్టి సారించి, శాస్త్రీయ అధ్యయనం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, నెల్లూరు జిల్లా యంత్రాంగం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని నిలిపివేసింది. దీనిపై నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు వివరణ ఇచ్చారు.

దీనిపై ఐసీఎంఆర్ శాస్త్రీయ పరిశోధన చేయాల్సి ఉందని, ఆ పరిశోధనలో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే... ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని తెలిపారు. మూలికా ఔషధం పంపిణీ ఆపివేశామని, ఈ ఔషధం తాలూకు శాంపిళ్లను డీఎంహెచ్ఓ, ఆయుష్ అధికారులు హైదరాబాదులోని ఓ ప్రయోగశాలకు పంపారని వెల్లడించారు.

దివ్వఔషధంగా పేర్కొంటున్న ఈ మందు కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ప్రజలు తరలివస్తున్నారు. కరోనా వైద్యం కోసం రూ.లక్షలకు లక్షలు ధారపోస్తున్న వేళ ఈ మందుపై ప్రజల్లో ఏదో తెలియని ఆశ చిగురించింది. అయితే ఈ మందు శాస్త్రీయంగా రుజువు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల నిమిత్తం ఆయుష్‌ ల్యాబ్‌కు పంపింది.


Tags:    

Similar News