విశాఖలో నేవీ డే వేడుకలు: ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము

*నేవీ డేలో అలరించిన యుద్ధ నౌకలు, విమానాలు

Update: 2022-12-04 14:44 GMT

విశాఖలో నేవీ డే వేడుకలు: ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము

Visakhapatnam: నౌకాదళ దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నిర్వహించిన నేవీ డే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేళ నిర్వహిస్తున్న ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. INS సింధు వీర్ జలాంతర్గామి ద్వారా రాష్ట్రపతికి త్రివర్ణ బాంబర్లతో నౌకాదళం ఘన స్వాగతం పలికింది. రాష్ట్రపతితో పాటు గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌, ఏపీ సీఎం జగన్ నేవీ వేడుకల్ని తిలకించారు. భారీగా తరలివచ్చిన సందర్శకులతో ఆర్కే బీచ్ జన సంద్రంగా మారింది.

ఇక నేవీ డేలో యుద్ధ నౌకలు, విమానాలు అలరించాయి. ప్రధానంగా మిగ్‌-19 యుద్ధ విమానాలు చేసిన విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్కై డైవర్ మువ్వన్నెల ప్యారాచూట్‌తో బీచ్‌లో దిగడం, నాలుగు యుద్ధ నౌకలపై ఒకేసారి హెలికాప్టర్లు ల్యాండింగ్, టేకాఫ్ చేపట్టడం చూపరులను ఆకట్టుకుంది. నేవీకి చెందిన మిగ్-29 యుద్ధవిమానాలు గగనతలంలో దూసుకెళ్లాయి. యుద్ధ విమానం నుంచి ఒకేసారి వెలువడిన కాంతిపుంజాలతో ఆకాశం వెలిగిపోయింది. యుద్ధ నౌకలు, జలాంతర్గాముల నుంచి ఒకేసారి రాకెట్ ఫైరింగ్ చేపట్టడాన్ని వీక్షకులు ఊపిరి బిగబట్టి తిలకించారు. రాత్రి వేళ సముంద్రంపై విద్యుత్ కాంతులీనుతూ యుద్ధనౌకలు అబ్బురపరిచాయి.

Tags:    

Similar News