Navratri: గోదావరి జిల్లాలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
Navratri: వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరిస్తున్న భక్తులు
Navratri: తెలుగు రాష్ట్రాల్లో దేవి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఒక్కో చోట ఒక్కోలా నిర్వహిస్తూ భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. ఇదే తరహాలో గోదావరి జిల్లాలో దేవి నవరాత్రులు ఘనంగా జరుపుతున్నారు. బెజవాడ కనకదుర్గ ఆలయంలో నిర్వహించే విధంగా అమ్మవారికి అలంకారాలు చేస్తూ ఆ మాత ఆశీస్సుల కోసం పూజలు చేస్తున్నారు.
బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమలాపురం మెయిన్ రోడ్‌లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఈ రోజు విభిన్న రీతిలో అలంకరించారు. గర్భాలయం, అంతరాలయం, ముఖ మండపాలను 2 కోట్ల 16 లక్షల కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఇక ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.