NarayanaSwamy: లోకేష్ చేస్తున్నది పాదయాత్ర కాదు..శవయాత్ర
NarayanaSwamy: మేము వేసిన రోడ్లపై నడుస్తూనే అభివృద్ధి జరగలేదంటున్నారు
NarayanaSwamy: లోకేష్ చేస్తున్నది పాదయాత్ర కాదని..శవయాత్ర అని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాదయాత్ర అంటే పటుత్వం ఉండాలన్నారు. ఏడారి యాత్రగా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మేము వేసిన రోడ్లపై నడుస్తూనే అభివృద్ధి జరగలేదని వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఆయన పాదయాత్ర చూస్తుంటే సైకో పాదయాత్రగా కనిపిస్తుందన్నారు.