Nara Lokesh: వైకాపా ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నాను
Nara Lokesh | రైతులకు విద్యుత్ బిల్లు సమస్య ఉండదని సీఎం జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Nara Lokesh | రైతులకు విద్యుత్ బిల్లు సమస్య ఉండదని సీఎం జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రాబోయే 30 ఏళ్ల వరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు, రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలంటే మీటర్లు ఉండాలన్న జగన్.. మీటర్ల ద్వారా ఫీడర్లపై భారం ఎంతో తెలుస్తుందని వివరించారు. ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాలలో డబ్బు జమచేస్తుందన్నారు. వినియోగించిన విద్యుత్ యూనిట్ల ప్రకారం రైతుల ఖాతాలోకి నగదు బదిలీ చేస్తారు అని తెలిపారు. దానిని రైతులు నేరుగా విద్యుత్ సరఫరా కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది అని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ అంశంపై టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు.
రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు. రైతాంగం అంతా ఒక్కటై ఈ దగా మీటర్లు మాకొద్దు అంటున్నా వైఎస్ జగన్ గారు బలవంతంగా మీటర్ల మోత పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా పర్వాలేదు మీటర్లు పెట్టడానికి మాత్రం అంగీకరించం అంటూ... రైతులు ఒక పక్క ఆందోళన చేస్తున్నా అనంతపురం జిల్లా, సింగనమల నియోజకవర్గం మర్తాడు గ్రామంలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు అధికారులు ప్రయత్నించడం దారుణం. వైకాపా ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అంటూ నారా లోకేష్ ట్వీట్ చేసారు.