ప్రధాని మోడీకి నారా లోకేష్ లేఖ
Nara Lokesh: ఎరువులు, డీఏపీ కృత్రిమకొరతపై సమగ్ర విచారణ జరపాలి
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లో ఎరువులు, డీఏపీ కృత్రిమ కొరతపై సమగ్ర విచారణ జరపాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కేంద్రానికి లేఖ రాశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోడీ, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కు వేర్వేరుగా లేఖలు రాశారు. సహకార సంఘాలకు డీఏపీ సరఫరాలో కోత విధించి, రైతు భరోసా కేంద్రాలకు మళ్లించామని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కేంద్రం 2.25 లక్షల టన్నుల డీఏపీని కేటాయించినా బ్లాక్ మార్కెటింగ్ , రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో కృత్రిమ కొరత ఏర్పడిందని లోకేశ్ వెల్లడించారు. బ్లాక్ మార్కెటింగ్ ను నివారించి రైతుల్ని ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన డీఏపీ సరఫరా పెంచాలని విజ్ఞప్తి చేశారు.