Nara Lokesh: ఎన్ని కేసులు పెట్టినా బెదరను.. భయపడను
Nara Lokesh: సీఎం జగన్‌పై నారా లోకేష్ ఫైర్
Nara Lokesh: సీఎం జగన్‌పై నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. పాదయాత్రలో అందరికీ ముద్దులు పెట్టాడు అధికారంలోకి వచ్చాక పన్నులతో పిడిగుద్దులు గుద్దుతున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 10వ రోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో జరుగుతోంది. పాదయాత్రలో పాల్గొన్న లోకేష్ ప్రజల్లోకి వచ్చినందుకు తనపై 17వ కేసు పెట్టారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా బెదరను భయపడనని లోకేష్ స్పష్టం చేశారు.