Kiran Kumar Reddy: నేను సీఎంగా ఉంటే మళ్లీ జిల్లాలను కలిపేవాడిని.. మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు..

ఏపీలోని జిల్లాల గురించి కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన జిల్లాల విభజన కారణంగా పాతజిల్లాలు అస్థిత్వం కోల్పోయాయని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Update: 2024-08-14 03:12 GMT

Kiran Kumar Reddy: నేను సీఎంగా ఉంటే మళ్లీ జిల్లాలను కలిపేవాడిని.. మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు..

Kiran Kumar Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కీలక నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని జిల్లాల గురించి కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన జిల్లాల విభజన కారణంగా పాతజిల్లాలు అస్థిత్వం కోల్పోయాయని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పాత జిల్లాలను కొనసాగిస్తే బాగుండేదని సూచించారు. నేను సీఎంగా ఉంటే ఆ పని చేసే వాడిని తేల్చి చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాత జిల్లాల అస్తిత్వం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. ప్రాజెక్ట్ పూర్తయితే సీమకు సాగునీరు ఢోకా ఉండదని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడుతుందని వివరించారు. న్యాయ, నీటి సూత్రాలకు విరుద్ధంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉందన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణకు పూర్తిగా నష్టం కలుగుతుందన్నారు. సమర్థుడైన చంద్రబాబు మరోసారి సీఎం కావడం సంతోషదాయకమని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన ముందు చాలా సవాళ్లు ఉన్నాయని చెప్పారు.

Tags:    

Similar News