Nallamala Forest: నల్లమల కేంద్రంగా జోరుగా నాటుసారా తయారీ.. డేగ కళ్ళతో పోలీసుల పహారా
Nallamala Forest: పక్కా సమాచారం అందిస్తే పారితోషకం
Nallamala Forest: నల్లమల అడవులనే కేంద్రంగా చేసుకొని నాటు సారా మాఫియా రెచ్చిపోతోంది. గుట్టు చప్పుడు కాకుండా గుడుంబాని తయారు చేస్తూ అక్రమ సంపాదనకు దిగుతోంది..నల్లమల లోని నాటుసారా పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు డ్రమ్ముల కొద్ది బెల్లం పూటలను, సంచుల కొద్ది సారా ప్యాకెట్లను స్వాధీన చేసుకుంటున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నల్లమల అడవులు నాటు సారా తయారీకి అడ్డాగా మారింది.దీనిపై పక్కా సమాచారం అందుకుంటున్న పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నారు. నాటుసారా మాఫియా వందల లీటర్ల సారా తయారు చేసి దానిని ప్యాకెట్లుగా మార్చి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.
నల్లమల ప్రాంతం.దట్టమైన అభయారణ్యం కావడం, సరైన రహదారులు తెలియకపోవటం, వన్యం మృగాలు దాడి చేస్తాయన్న భయంతో ఇప్పటివరకు అంతంత మాత్రంగానే స్పందించిన పోలీసు సిబ్బంది ఇప్పుడు అడవుల బాట పట్టారు... అనువణువు క్షుణ్ణంగా పరిశీలిస్తూ, దట్టమైన అరణ్యంలో మెరుపు దాడులు చేస్తున్నారు.. నాటు సారా సేవిస్తున్న వారు అనారోగ్యానికి గురై ఆస్పత్రుల పాలవుతున్నారని స్థానికులంటున్నారు.
ఎవరైనా నాటు సారా తయారు చేస్తున్నట్టు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. దీనికి తగిన పారితోషకం కూడా ఉంటుందన్నారు.