ఏపీలో మరో ఎన్నికల నగారా! మార్చి 10 న మున్సిపల్ ఎన్నికలు!!
* ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల *గతంలో నిలిచిన దగ్గర నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం *మార్చి 3న మ.3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా.. మార్చి 14న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక.. గతంలో ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఆగిందో.. తిరిగి అక్కడినుంచే ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది ఎస్ఈసీ. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ప్రకటించింది.
ఏపీలోని 12 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 75 మున్సిపాల్టీ, నగర పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ రీలీజ్ అయింది. గత ఏడాది మార్చి 9న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. నామినేష్ల పరిశీలన అనంతరం కోర్టు ఉత్తర్వులతో గత ఏడాది మార్చి 14న ఎన్నికల ప్రక్రియను నిలిపివేశారు. ఇప్పడు తాజాగా మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవ్వడంతో.. ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ ఆగిందో.. తిరిగి అక్కడినుంచే ప్రారంభించాలని ఎస్ఈసీ నిర్ణయించింది.