Raghurama Krishnamraju: రఘరామకృష్ణరాజుకు రిమాండ్‌

Raghurama Krishnamraju: సీబీసీఐడీ కోర్టు ఎంపీ రఘరామకృష్ణరాజుకు రిమాండ్‌ విధించింది.

Update: 2021-05-15 16:46 GMT

రఘరామకృష్ణరాజు (ఫొటో హెచ్‌ఎంటీవీ)

Raghurama Krishnamraju: సీబీసీఐడీ కోర్టు ఎంపీ రఘరామకృష్ణరాజుకు రిమాండ్‌ విధించింది. ఈ నెల 28 వరకు రిమాండ్‌కు కోర్టు అనుమతినిచ్చింది. జీజీహెచ్‌ హాస్పిటల్‌కు తరలించాలని అధికారులను ఆదేశించింది. ఈ సాయంత్రం రఘురామకృష్ణరాజును అధికారులు సీబీసీఐడీ స్పెషల్‌ కోర్టులో హాజరుపర్చిన సంగతి తెలిసిందే. సీఐడీ పోలీసులు ఆరో అదనపు మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ ముందు రఘురామను హాజరుపర్చారు. సీఐడీ జడ్జి ఎదుట ఏ1గా రఘురామను ప్రవేశపెట్టారు. ఈ మేరకు రిమాండ్‌ రిపోర్ట్‌ను అందజేశారు.

కాగా, ఈ ఉదయం రఘురామ బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. రఘురామ అరెస్ట్‌ విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. బెయిల్‌ కావాలంటే కింది కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అదే సమయంలో రఘురామకృష్ణరాజుతో పాటు TV5, ABNలపై కూడా సీఐడీ కేసులు నమోదు చేసింది. A1గా రఘురామకృష్ణరాజు, A2గా TV5, A3గా ABNలపై కేసులు ఫైల్‌ చేశారు.

Tags:    

Similar News