Monsoon: నైరుతి రుతుపవనాలు రాక ఆలస్యం

Update: 2021-05-30 14:28 GMT

Monsoon   (Thehansindia )

Monsoon: ఏడాది నైరుతి రుతు పవనాలు రాక ఆస‌ల్యం కానుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. వ‌చ్చే నెల జూన్‌ 3న ఇవి కేరళ తీరాన్ని తాకనున్నాయని కర్ణాటక తీరంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రుతుపవనాల రాక ఆలస్యమవుతున్నట్లు ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ ఎం మొహాపాత్ర వెల్లడించారు. నైరుతి రుతు పవనాలు ఒకసారి దేశంలోకి ప్రవేశించాక నాలుగు నెలల పాటు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవనాలు జూన్‌ 1 నుంచి మరింత బలపడతాయని, దీంతో కేరళలో వర్షాలు ప్రారంభమవుతాయని తెలిపారు. జూన్‌ 3న ఇవి కేరళను తాకుతాయని చెప్పారు. వాస్తవానికి జూన్‌ 1నే కేరళ తీరాన్ని రుతు పవనాలు తాకుతాయని గతంలో ఐఎండీ వెల్లడించింది. ఈ సారి దేశంలో సాధారణ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు జూన్ 12 నాటికి రుతుపవనాలు వచ్చే అవకాశమున్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.

Tags:    

Similar News