Breaking News: వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూత
MLC Bhageeratha Reddy: వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి అస్వస్థతతో చికిత్స పొందుతూ బుధవారంనాడు మృతి చెందాడు.
MLC Bhageeratha Reddy: వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి అస్వస్థతతో చికిత్స పొందుతూ బుధవారంనాడు మృతి చెందాడు. కొన్ని రోజులుగా కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయన ఆదివారం తీవ్రమైన దగ్గుతో ఇబ్బందిపడ్డారు. నంద్యాల జిల్లా అవుకులోని తన స్వగృహం నుంచి కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రెండు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచాడు. గురువారం అవుకులో ఆయన అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.
మాజీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి తనయుడే చల్లా భగీరథరెడ్డి. రామకృష్ణారెడ్డి వారసుడిగా భగీరథరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. చల్లా రామకృష్ణారెడ్డి ఆకస్మికంగా మరణించడంతో ఆయన తనయుడు భగీరథ రెడ్డికి జగన్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు.