MLA Roja: ఆర్టీసీ బస్సు ప్రారంభం.. గ్రామస్థుల పద్నాలుగేళ్ల కల నెరవేరిందన్న మంత్రి రోజా

MLA Roja: మంత్రి రోజా చొరవతో నెరవేరిన గ్రామస్థుల ఆకాంక్ష

Update: 2023-08-25 12:57 GMT

MLA Roja: ఆర్టీసీ బస్సు ప్రారంభం.. గ్రామస్థుల పద్నాలుగేళ్ల కల నెరవేరిందన్న మంత్రి రోజా 

MLA Roja: పద్నాలుగేళ్ల క్రితం వరకు ఉన్న బస్సు సౌకర్యం టీడీపీ పాలనలో ఆగిందని... అప్పటి నుంచి బస్సు కోసం ఎదురుచూపులు తప్ప బస్సు జాడ కనిపించలేదని మంత్రి రోజా అన్నారు. తమ గ్రామానికి బస్సు సౌకర్యం కావాలని అడిగిన చిత్తూరు జిల్లా, ముడిపల్లి గ్రామస్థుల కలను మంత్రి రోజా నెరవేర్చారు. ఇటీవల ముడిపల్లి గ్రామంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో గ్రామస్థులు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఎదురయ్యే ఇబ్బందులను మంత్రి రోజా దృష్ఠికి తీసుకువెళ్లారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్ఠి సారించి ఆర్టీసీ అధికారులతో చర్చించిన రోజా.. పద్నాలుగేళ్ల మేళపట్టు, ముడిపల్లి, ఏడుగట్లు ప్రజల నిరీక్షణకు తెర దించారు. ఈ కొత్త బస్సు వరలక్ష్మీ వత్రం రోజున ప్రారంభించడం సంతోషంగా ఉందని రోజా తెలిపారు.

Tags:    

Similar News