మహిళా వాలంటీర్ కాళ్లు కడిగిన ఎమ్మెల్యే ఆర్కే
MLA RK: గుంటూరు జిల్లా ఈమని గ్రామానికి చెందిన రజితకు అభినందనలు తెలిపిన ఆర్కే
MLA RK: దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో గ్రామ సచివాలయ వాలంటీర్లు సేవలు చేస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా శ్రమిస్తున్నవాలంటీర్లపై ప్రతిపక్షాలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలోని మహిళా వాలంటీర్ రజిత కాళ్లు కడిగి, ఘనంగా సన్మాంచారు. అనంతరం ఆమెకు అభినందనలు తెలిపారు.