Rapaka Varaprasad: జనసేనపై రాపాక ఆసక్తికర వ్యాఖ్యలు
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.. ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అయన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గురించి కామెంట్స్ చేశారు.
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.. ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అయన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గురించి కామెంట్స్ చేశారు. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన మీడియా ముందు మాట్లాడుతూ.. తానూ జనసేన పార్టీకి దూరంగా లేను.. దగ్గరగా లేను అని అన్నారు. తనకు పార్టీ నుంచి ఎటువంటి సమాచారం రాలేదని రాపాక అన్నారు. పవన్ కళ్యాణ్ తాను ఈ మధ్య కాలంలో కలవలేదని, తనకు పార్టీ నుంచి ఎటువంటి సమాచారం రాలేదని వెల్లడించారు.
రాష్ట్రంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన బాగుందని అన్నారు. మూడు రాజధానుల వల్ల లభామే ఉందని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవసరమని రాపాక అన్నారు. ఇక విశాఖపట్నం రాజధానిగా ఉంటే గోదావరి ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాలన్ని అభివృద్ధి చెందుతాయని రాపాక అభిప్రాయపడ్డారు. జగన్ ప్రభుత్వ పాలన విధానాలు బాగుంటే మద్దుతు ఇస్తానని లేకోపోతే లేదని రాపాక స్పష్టం చేశారు.
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి రాపాక రాజోలు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆ తర్వాత అయన కూడా వైసీపీలో చేరుతారని రకరకాల వార్తలు వచ్చాయి. కానీ వాటిని అయన ఖండిచారు. ఇక ఆ తర్వాత పార్టీకి, పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ వస్తున్న అయన ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొంటూ, సొంత పార్టీకి షాకుల మీదా షాకులు ఇస్తూ వస్తున్నారు.
అంతేకాకుండా సీఎం జగన్‌కు పాలాభిషేకాలు చేయడంతో పాటు అసెంబ్లీలోనూ వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఈ నేపధ్యంలో జనసేన్ అధినేత పవన్ పలు సందర్బాలలో ఉన్న ఒక్క ఎమ్మెల్యే పార్టీలో ఉన్నారో లేదో అంటూ ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ఇప్పుడు రాపాక జనసేన పార్టీకి దూరంగా లేను.. దగ్గరగా లేను అంటూ కామెంట్స్ చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని సంతరించుకున్నాయి.