ఏపీ అసెంబ్లీ ముందు ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన
Kotamreddy: తన నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Kotamreddy: ఏపీ అసెంబ్లీ ముందు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కోటంరెడ్డి అసెంబ్లీకి వచ్చారు. తన నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతరాత్మ ప్రభోదానుసారo ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తానన్నారు. వైసీపీ ఇతర ఎమ్మెల్యేలు కూడా.. వారి అంతరాత్మ ప్రభోదానుసారo ఓటు వేస్తారని భావిస్తున్నానని తెలిపారు కోటంరెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారానికి తన నిరసన కొనసాగుతుందని.. 4 ఏళ్లు సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి.. విసిగిపోయే నిరసన గళం వినిపిస్తున్నానన్నారు.