Kotam Reddy: ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు బయటపెట్టిన కోటంరెడ్డి...

Kotam Reddy: ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది.

Update: 2023-02-01 06:28 GMT

Kotam Reddy: ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు బయటపెట్టిన కోటంరెడ్డి...

Kotam Reddy: ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార పార్టీపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ప్రెస్‌మీట్ పెట్టాల్సి వస్తుందనుకోలేదని, వైఎస్సార్, జగన్‌కు తనెప్పుడూ విధేయుడిగానే ఉన్నానని చెప్పారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడ్డానని, అధికారంలోకి వచ్చాక గుర్తింపు ఇవ్వకపోయినా బాధపడలేదన్నారు.

పార్టీలో ఎన్నో అవమానాలను భరించానని, పార్టీ గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదని అన్నారు. తన ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు 4 నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి చెప్పారన్నారు. ముందు తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే నమ్మలేదన్నారు. సీఎం జగన్‌పై కోపంతో ఆ అధికారి అబద్ధం చెప్పారని భావించానన్నారు. 20 రోజుల ముందు తన ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారం దొరికిందన్నారు. సీఎం గానీ, సజ్జల గానీ చెప్పకుండా తన ఫోన్ ట్యాప్ చేయరని... అనుమానాలు ఉన్న చోట తానుండాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నానని తన ఫోన్ ట్యాంపింగ్ చేశారన్నారు.

కొన్ని రోజుల క్రితం నా బాల్య మిత్రుడితో ఐఫోన్‌లో మాట్లాడా. ఆ విషయాల గురించి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులు అడిగారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నాకు ఆడియో క్లిప్‌ పంపారు. ట్యాపింగ్‌ చేశారనడానికి ఇంతకుమించి ఆధారాలేం కావాలి? ఫోన్‌ ట్యాపింగ్‌ కాకుండా ఆడియో క్లిప్‌ ఎలా బయటకు వచ్చింది? రెండు ఐఫోన్ల మధ్య సంభాషణ ట్యాప్‌ చేయకుండా ఎలా వచ్చింది? 98499 66000 నంబర్‌ నుంచి ఆడియో క్లిప్‌ వచ్చింది.. ఆ నంబర్‌ ఎవరిదో చెక్‌చేసుకోండి. ఏసీబీ చీఫ్‌గా ఉన్నప్పటి నుంచి సీతారామాంజనేయులు ఆ నంబర్‌ను వాడుతున్నారు. నేను ట్యాపింగ్‌ అంటున్నా.. కాదంటే మీరు నిరూపించండి. నా ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారో చెప్పండి. ట్యాపింగ్‌పై కేంద్రహోంశాఖు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయబోతున్నా అని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. 

Tags:    

Similar News