చంద్రబాబు, లోకేష్‌కు ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్.. నిరూపిస్తే రాజీనామా..
Dharmavaram: చంద్రబాబు, లోకేష్‌కు ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్ విసిరారు.
Dharmavaram: చంద్రబాబు, లోకేష్‌కు ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. నిరూపించలేకపోతే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి ధర్మవరంలో చెరువును ఆక్రమించుకుని ఫామ్‌హౌజ్ నిర్మించుకున్నారని యువగళంలో నారా లోకేష్ ఆరోపించారు. లోకేష్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే స్పందించారు. ఉండవల్లిలోని కరకట్ట వద్ద గల చంద్రబాబు నివాసం సమీపంలోకి వెళ్లారు. ఫేస్ బుక్ లైవ్‌లో చంద్రబాబు నివాసం చూపుతూ ఇది అక్రమ కట్టడం కాదా అని నిలదీశారు కేతిరెడ్డి.