ఎమ్మెల్యే కన్నబాబురాజు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
* వైసీపీ మద్దతుదారుని గెలిపించి తీరాలని ఎమ్మెల్యే హుకూం జారీ
రెండు రోజుల క్రితమే వార్డు మెంబర్ కుటుంబ సభ్యుల్ని బెదిరించినందుకు యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబునురాజును శనివారం అరెస్ట్ చేసి విడుదల చేసారు పోలీసులు. అయితే అతని తీరులో ఏ మార్పు రాలేదు. ఈసారి డైరెక్టుగా ఓటర్లనే బెదిరించారు. వైసీపీ మద్దతుదారునికి గెలిపిస్తేనే అన్ని పథకాలు అందుతాయని అని అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.