తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Tirumala: వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి.. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Tirumala: తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. తెలంగాణ ప్రజలు ఆయురాయోగ్యాలతో.. సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు.