విదేశీ ప్రయాణికులు మిస్సింగ్ వార్తలు అవాస్తవం: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

Andhra Pradesh: విదేశాల నుంచి వచ్చిన 30 మంది ప్రయాణికులు కనిపించకుండా పోయారన్న వార్తలను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కొట్టిపడేసింది.

Update: 2021-12-03 10:31 GMT

విదేశీ ప్రయాణికులు మిస్సింగ్ వార్తలు అవాస్తవం: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

Andhra Pradesh: విదేశాల నుంచి వచ్చిన 30 మంది ప్రయాణికులు కనిపించకుండా పోయారన్న వార్తలను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కొట్టిపడేసింది. ఏపీలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు లేవని, ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో దిగే వారికి కేంద్ర గైడ్‌లైన్స్ ప్రకారం టెస్టులు నిర్వహిస్తున్నారంది. ఏపీకి విదేశాల నుంచి వచ్చిన 30మంది జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్న రాష్ట్ర ఆరోగ్యశాఖ వారంతా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారని, వారిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేసింది.

కాగా.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో గుబులు పుట్టిస్తున్న ఒమిక్రాన్ మన దేశంలోనూ అడుగు పెట్టింది. బెంగళూరులో ఇద్దరికి గురువారం ఒమైక్రాన్‌ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. మరికొందరు విదేశీ ప్రయాణికుల నమూనాల జన్యు విశ్లేషణ ఫలితాలు రావాల్సి ఉంది. 

Tags:    

Similar News