విజయవాడలో దారుణం.. వ్యక్తిని హత్య చేసిన మైనర్లు
Vijayawada: మైనర్లపై లైంగిక దాడికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తి
Vijayawada: విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని మైనర్లు దారుణంగా హత్య చేశారు. తమపై లైంగిక దాడికి పాల్పడ్డాడని గుర్తు తెలియని వ్యక్తిని మైనర్లు కర్రలతో కొట్టి చంపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమపై పదే పదే లైంగిక దాడికి దిగడంతో హత్య చేశామని మైనర్లు అంగీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.