Anganwadi: అంగన్‌వాడీ కార్మికసంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు
Anganwadi: 11 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచిన అంగన్‌వాడీ కార్యకర్తలు
Anganwadi: మరికాసేపట్లో అంగన్‌వాడీ కార్మికసంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరపనుంది. అంగన్‌వాడీ వర్కర్ల డిమాండ్లపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించనుంది. సెక్రటేరియట్‌లని రెండో బ్లాక్‌లో జరగనున్న ఈ సమావేశానికి మంత్రులు ఉష శ్రీ చరణ్, బొత్స, బుగ్గనతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. గౌరవ వేతనం పెంపు, గ్రాట్యుటీ సహా 11 డిమాండ్లతో అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మెకు దిగారు.
గత 15 రోజులుగా ఏపీలో ఈ సమ్మె కొనసాగుతోంది. అంగన్‌వాడీ కార్మికసంఘం నేతలు 11 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచగా.. కొన్ని డిమాండ్లపై సానుకూలంగా స్పందించినట్టు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే 26వేల రూపాయల వేతనం, గ్రాట్యుటీపై క్లారిటీ ఇవ్వలేదంటూ అంగన్వాడీలు తమ సమ్మెను కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఇవాళ చర్చలు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.