మంత్రి కొడాలి నానికి సొంత ఊరిలోనే చేదు అనుభవం ఎదురైన సంగతీ తెలిసిందే. అయితే ''యలమర్రు తన సొంత గ్రామం కాదని తమ పూర్వికులదని మంత్రి చెప్పుకచ్చారు. యలమర్రులో నేనెప్పుడూ రాజకీయాలు చేయలేదని చెప్పుకచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు మెప్పు కోసమే.. కొందరూ తన సొంతూరిగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 21 తర్వాత వాస్తవాలను మీడియాతో వెల్లడిస్తా.. అందరి సంగతి తేలుస్తా'' అని కొడాలి నాని హెచ్చరించారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రులో కొల్లూరి అనూష 271 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 12 వార్డుల్లో 11 టీడీపీ మద్దతుదారులే సొంతం చేసుకున్నారు. నిజంగా ఇది నానికి ఊహించని షాక్ అని కొందరు టీడీపీ వీరాభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.