ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వ్యవహారంపై కొడాలి ఘాటు వ్యాఖ్యలు
కరోనా దృష్ట్యా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం లేదని అన్నారు మంత్రి కొడాలి నాని. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు మంత్రి
కరోనా దృష్ట్యా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం లేదని అన్నారు మంత్రి కొడాలి నాని. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు మంత్రి. నిమ్మగడ్డ తాను చెప్పందే రాజ్యాంగమంటే కుదరదని.. ప్రభుత్వానికి ప్రజల శ్రేయస్సే ముఖ్యమని అన్నారు. నవంబర్, డిసెంబర్‌లో మరోసారి కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారన్నారు. బీహార్‌లో కచ్చితంగా జరగాల్సిన రాష్ట్ర ఎన్నికలు కనుక నిర్వహించక తప్పడంలేదని వివరించారు. బీహార్ ఎన్నికలతో స్థానిక ఎన్నికలు పోల్చకూడదని స్పష్టం చేశారు మంత్రి.