Vizag Steel Plant: ప్రైవేటీకరణపై మంత్రి గౌతమ్‌రెడ్డి కీలక ప్రకటన
Vizag Steel Plant: స్టీల్‌ప్లాంట్ కొనుగోలుపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పెట్టలేదు -మేకపాటి
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రి గౌతమ్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంట్ కొనుగోలుపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలు పెట్టలేదని, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని అన్నారు. కేంద్రం ప్రస్తావిస్తే ఏపీ ప్రభుత్వం కొనుగోలు అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు మంత్రి మేకపాటి. అలాగే.. గంగవరం పోర్టు అదానీ చేతికెళ్లడం మంచిదేనని అన్న మంత్రి గౌతమ్‌రెడ్డి.. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా కొనసాగుతుందని స్పష్టం చేశారు.