ఇవ్వాల్సింది గాజులు కాదు.. భూములు: మంత్రి బొత్స

మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో నిన్న(బుధవారం) పెద్ద డ్రామా జరిగిందని అన్నారు.

Update: 2020-01-02 09:28 GMT
బొత్స సత్యనారాయణ

మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో నిన్న(బుధవారం) పెద్ద డ్రామా జరిగిందని అన్నారు. చంద్రబాబు దంపతులు నిన్న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చి అమరావతిలో రైతుల ఆందోళనలో పాల్గొన్నారని విమర్శించారు. నారా భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదు.. కొట్టేసిన భూములని వ్యాఖ్యానించారు.

రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబును చూసి బయపడేవారని చంద్రబాబు అన్నారు.. ఏ విషయంలో.. దేనికి బయపడ్డారో కూడా చెప్పాలని అన్నారు. అప్పట్లో చంద్రబాబు మంత్రి అవ్వడానికి రాజశేఖర్ రెడ్డే కారణమని అన్నారు బొత్స. ఆందోళన చేస్తున్న రైతులు భయపడాల్సిన అవసరం లేదని తమ ప్రభుత్వం ఎవ్వరికి అన్యాయం చేయద్దని హామీ ఇచ్చారు. అటు ఆర్ధిక పరిస్థులు గాను ఇటు సామజిక పరిస్థులు గాని దృష్టిలో ఉంచుకొని గతంలో చంద్రబాబు పరిపాలన చేసి ఉంటే రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలు అయి ఉండేది కాదన్నారు.

ఐదు సంవత్సరాల టీడీపీ పరిపాలనలో రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు బొత్స. frbm పరిమితిని దాటి అప్పులు చెయ్యడంతో ఇవాళ రాష్ట్రం చాలా ఇబ్బందులు పడుతోందని అన్నారు. రాజధానిపై హైపవార్ కమిటీ చర్చించాకే నిర్ణయం ఉంటుందని అన్నారు. తమ ప్రభుత్వ లక్ష్యం అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే అని స్పష్టం చేశారు బొత్స. కాగా నిన్న అమరావతిలో పర్యటించిన చంద్రబాబు దంపతులు రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఆ సమయంలో ఉద్యమ ఖర్చులకంటూ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తన రెండు గాజులను తీసి జేఏసీ కి ఇచ్చారు.

Tags:    

Similar News