పవన్‌కల్యాణ్ కామెంట్స్‌కు మంత్రి బొత్స కౌంటర్.. పవన్ గాలి మాటలు మాట్లాడుతున్నారు

Botsa Satyanarayana: ప్రజల డేటాను హైదరాబాద్‌లో ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు

Update: 2023-07-13 09:15 GMT

పవన్‌కల్యాణ్ కామెంట్స్‌కు మంత్రి బొత్స కౌంటర్.. పవన్ గాలి మాటలు మాట్లాడుతున్నారు

Botsa Satyanarayana: పవన్ కల్యాణ్‌ కామెంట్స్‌కు మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన పాట్నర్ మాత్రమే హైదరాబాద్‌లో ఉంటారని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. ప్రజల డేటాను హైదరాబాద్‌లో ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని తెలిపారు. ఏ డేటా ఎక్కడ ఉందో పవన్ కల్యాణ్‌కు తెలుసా..? అని ప్రశ్నించారు. పవన్ గాలి మాటలు మాట్లాడుతున్నారని... పవన్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని బొత్స అన్నారు. ఏ నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయో పవన్ కల్యాణ్ చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. నిఘా వర్గాలు సమాచారం ఇచ్చి ఉంటే చూపించాలన్నారు బొత్స.

Tags:    

Similar News