Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు ప్రభుత్వం తప్పిదాల వల్లే ప్రాజెక్ట్ ఆలస్యమైంది
Ambati Rambabu: గత ప్రభుత్వం ప్రొటోకాల్‌కు విరుద్దంగా పనులు చేపట్టింది
Ambati Rambabu: భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. ఈ సందర్బంగా పోలవరం నిర్మాణ పనులపై మంత్రి అంబటి ఆరా తీశారు. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్ దగ్గర వరదపై సమీక్ష చేపట్టారు. గత ప్రభుత్వం ప్రొటోకాల్‌కు విరుద్దంగా పనులు చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తప్పిదాల వల్లే ప్రాజెక్ట్ ఆలస్యమైందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి అంబటి అన్నారు.