AP Health Minister Alla Nani: టిడిపి హయాంలో వైద్య ఆరోగ్య శాఖ బ్రష్టుపట్టిపోయింది.. .మంత్రి ఆళ్ళ నాని

Update: 2020-09-21 08:38 GMT

AP Health Minister Alla Nani: టీడీపీ హయాంలో వైద్య ఆరోగ్య శాఖ బ్రష్టుపట్టిపోయిందని, దాన్ని గాడిన పెట్టె కార్యక్రమాలు సీఎం జగన్ చేపడుతున్నారని మంత్రి ఆళ్ళ నాని వ్యాఖ్యలు చేసారు. సూపర్ స్పెషాలిటీలు పట్టణాలకే పరిమితం కాకూడదు అనేది ముఖ్యమంత్రి ఆలోచన అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని 6 ఐటీడీఏ ల్లోనూ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 కొత్త సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేయబోతున్నామని ఆయన అన్నారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 49 కోట్ల వ్యయంతో పాలకొండ, సీతంపేట ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం జరుగబోతున్నాయని తెలిపారు.

వైద్యం పట్టణాలకు, నగరాలకు పరిమితం కాకూడదు అని ముఖ్యమంత్రి ఎప్పుడూ చెబుతుంటారన్నారు. చంద్రబాబు హయాంలో వైద్య ఆరోగ్య శాఖ తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యిందని తెలిపారు. వైద్యానికి, ఆసుపత్రులకు ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదని ఆయన పేర్కొన్నారు. 16 వేల కోట్లకు పైగా వెచ్చించి నాడు నేడు పనులు చేస్తున్నామన్నారు. 200 కోట్లకు పైగా నాడు నేడు కింద శ్రీకాకుళంకు కేటాయించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో బిపి.హెచ్.సి ల ఆధునీకరణ ప్రారంభం అయ్యిందన్నారు. రిమ్స్ అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని తెలిపారు. సీతంపేట ఐటీడీఏ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News