Andhra Pradesh: ప్రతి విద్యార్థి ప్రాణం మాకు ముఖ్యమే- మంత్రి సురేష్‌

Andhra Pradesh: సీఎం జగన్‌పై లోకేశ్ అవాకులు చెవాకులు పేలుతున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు.

Update: 2021-04-22 12:30 GMT

Andhra Pradesh: ప్రతి విద్యార్థి ప్రాణం మాకు ముఖ్యమే- మంత్రి సురేష్‌

Andhra Pradesh: సీఎం జగన్‌పై లోకేశ్ అవాకులు చెవాకులు పేలుతున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు. లోకేశ్ మాట్లాడిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రతిపక్షాలకు కనిపించడం లేదని విమర్శించారు. ప్రతి విద్యార్థి ప్రాణం తమకు ముఖ్యమని తెలిపారు. లోకేశ్‌ చూపిస్తున్న డిగ్రీలు నిజంగా కష్టపడి చదివి సంపాధించి ఉంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నించారు.

కోవిడ్ నేపథ్యంలో 1 నుంచి 9 వరకు తరగతులు నిర్వహించడం లేదని మంద్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. వేసవి సెలవులు ఏప్రిల్ 20 నుంచి ఇచ్చామని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలన్నింటిలో 9వ తరగతి వరకు విద్యార్థులను హాస్టళ్ళ నుంచి పంపించామని పేర్కొన్నారు. యూనివర్సిటీ విద్యపై మరొక సమీక్ష నిర్వహిస్తామని, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత ముఖ్యంగా నిర్ణయిస్తున్నామన్నారు. పబ్బం గడుపుకోవాలని లోకేష్ మాట్లాడిన మాటలు విద్యార్థులను, తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు. ప్రతి విద్యార్థి ప్రాణం తమకు ముఖ్యమేనని స్పష్టం చేశారు. కానీ ప్రతిపక్షాలకు మాత్రం ప్రభుత్వ చర్యలు కనిపించడం లేదని అన్నారు.

Tags:    

Similar News