ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకానికి 'జగనన్న గోరుముద్ద'గా నామకరణం చేశారు. నిన్నటి నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. మెనూలో పూర్తిగా మార్పులు చేశారు. ఒకే తరహా భోజనాన్ని అందించి విద్యార్థులకు మొహం మొత్తేలా చేయకుండా రోజూ ఓ కొత్త రకమైన వంటకం పెడతారు.
రోజువారి మెనూ వివరాలు..
♦ సోమవారం: అన్నం, పప్పుచారు, కోడి గుడ్డు కూర, చిక్కీ
♦ మంగళవారం: పులిహోర, టమాట పప్పు, ఉడకబెట్టిన గుడ్డు
♦ బుధవారం: వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ
♦ గురువారం: కిచిడీ, టమాటా చట్నీ, ఉడకబెట్టిన గుడ్డు
♦ శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ
♦ శనివారం: అన్నం, సాంబార్, తీపి పొంగలి వడ్డిస్తారు.
ఆయాలకు వేతనాల పెంపు..
జగనన్న గోరుముద్ద పథకంలో పనిచేసే ఆయాలకు ఇచ్చే గౌరవ వేతనాన్ని వెయ్యి రూపాయల నుంచి మూడువేల రూపాయలకు పెంచారు. దీంతో ప్రభుత్వంపై 344 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పెంచేందుకు నాలుగంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. పాఠశాల అభివృద్ధి కమిటీ నుంచి ముగ్గురు సభ్యులకు పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. వీరితో పాటు వార్డు, గ్రామ సచివాలయంలో ఉండే విద్య, సంక్షేమ అధికారి నాణ్యతను పరిశీలించేలా ఏర్పాట్లు చేశారు. వీరందరిపై ఆర్డీవో స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుంది.