Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన.. వీళ్లిద్దరిని గెలిపించండి..!
Chiranjeevi: సీఎం రమేష్, పంచకర్ల రమేష్‌లను గెలిపించాలని అభ్యర్థన
Chiranjeevi: చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడటం మంచి పరిణామమని అన్నారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సీఎం రమేశ్, పెందుర్తి నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న పంచకర్ల రమేష్‌లను గెలిపించాలని కోరారు. పంచకర్ల రమేశ్ తన ఆశీస్సులతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారని చెప్పారు. ఏపీ అభివృద్ధిలో ముందుకెళ్లాలంటే... ప్రజలంతా నడుం బిగించి ఇలాంటి వారికి ఓటు వేసి గెలిపించాలని చిరంజీవి కోరారు.