టీడీపీ కార్యాలయంపై దాడి కేసు: సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసుల నోటీసులు

సజ్జల రామకృష్ణారెడ్డికి గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు.

Update: 2024-10-16 07:24 GMT

Sajjala Ramakrishna Reddy: సజ్జల రామకృష్ణారెడ్డికి గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావాలని పోలీసులు ఆ నోటీసులో చెప్పారు. అక్టోబర్ 17న విచారణకు రావాలని పోలీసులు కోరారు.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. ఈ కేసులో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, నాయకులు దేవినేని అవినాష్ లు విచారణకు హాజరయ్యారు. విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డిని మంగళగిరి పోలీసులు ఇవాళ నోటీసులు జారీ చేశారు. ముంబై ఎయిర్ పోర్టులో సజ్జల రామకృష్ణారెడ్డిని ఎయిర్ పోర్ట్ అధికారులు అక్టోబర్ 15న నిలిపివేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై లుకౌట్ నోటీస్ జారీ చేసినందున అధికారులు ఆయనను నిలిపివేశారు. గుంటూరు పోలీసులతో ఎయిర్ పోర్ట్ అధికారులు సంప్రదింపులు జరిపిన తర్వాత అధికారులు ఆయనను వదిలివేశారు.

Tags:    

Similar News