Maha Shivaratri 2021: కోస్తాంధ్రా లో ఘనంగామహా శివరాత్రి

Maha Shivaratri 2021: మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాలలో భక్తుల రద్దీ నెలకొంది

Update: 2021-03-11 06:16 GMT

మహా శివరాత్రి ఉత్సవాలు (ఫైల్ ఫోటో)

Maha Shivaratri 2021: 

శ్రీకాకుళం జిల్లా:

శ్రీకాకుళం జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివుడి దర్శనార్ధం క్యూలైన్‌ల్లో భక్తులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో ద్వాపరయుగంలో బలరాముడు ప్రతిష్టించిన శివాలయం అయిన ఉమ రుద్రకోటేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు

విజయనగరం జిల్లా:

విజయనగరం జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగుతున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా:

తూర్పుగోదావరి జిల్లాలోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. మురమళ్ల, ద్రాక్షారామం, కోటిపల్లి, ముక్తేశ్వరం, పిఠాపురం, సామార్ల కోట క్షేత్రాలల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది. 

Tags:    

Similar News