Madanapalli Case: హత్యల కేసులో కొత్త ట్విస్టు.. అపర కాళికగా పద్మజ.. అర్జునుడిగా పురుషోత్తం..
మూఢనమ్మకం, మూర్ఖపు పరిణామాలు ఓ ఫామిలీని ఛిన్నాభిన్నం చేసేశాయి.
మూఢనమ్మకం, మూర్ఖపు పరిణామాలు ఓ ఫామిలీని ఛిన్నాభిన్నం చేసేశాయి. చిత్తూరు జిల్లా మదనపల్లి జంట హత్యల కేసులో వెలుగు లోకొస్తున్న కొత్త విషయాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. శివుడిని అమితంగా ఆరాధించే అలేఖ్య పుట్టుక, చావులు తన చేతుల్లోనే ఉన్నాయని బలంగా విశ్వసించడం సంచలనం కలిగిస్తోంది. కరోనా కారణంగా.. నెలల తరబడి ఇంటికే పరిమితమైన అలేఖ్య లాక్‌డౌన్ సమయాన్ని కేవలం పుస్తక పఠనానికే కేటాయించింది. మహాభారతంతో పాటు చారిత్రక పుస్తకాలను చదివిన అలేఖ్యపై వాటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ కేసులో తాజాగా మరికొన్ని ట్విస్టులు వెలుగుచూశాయి. ఇద్దరూ కూతుళ్లను చంపిన కేసులో తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తంనాయుడుని పోలీసులు 4 రోజులుగా విచారిస్తున్నారు. ప్రధాన నిందితురాలు పద్మజ మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తుండగా.. పురుషోత్తంనాయుడు తేరుకొని పోలీసులకు సమాధానం చెప్తున్నట్లు తెలుస్తోంది. పురుషోత్తం ఇచ్చే సమాదానాలు పోలీసులను షాక్ గురైయ్యారని తెలుస్తోంది.
పద్మజ ప్రవర్త పోలీసుల మిస్టరీగా మారింది. అలేఖ్యను హత్య చేసిన అనంతరం తాను కాళికా దేవినని అరుస్తూ.. కత్తితో అలేఖ్య నాలుక కోసి తినేసినట్లు తెలుస్తోంది. అయితే శవపరీక్షల తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అలేఖ్య తనతో పూర్వజన్మలో అర్జునుడివి.. నీ పని కాలేజీలో పాఠాలు చెప్పడం కాదు.. పాండవులకు అర్జునుడు నాయకత్వం వహించినట్లు పోరాట స్ఫూర్తిని రగిల్చాలని తనతో చెప్పినట్లు పురుషోత్తంనాయుడు వివరించాడట.
మృతురాలు అలేఖ్య తనను తాను శివుడి ప్రతిరూపంగా భావిందేదని, శివుడు ఒక స్త్రీరూపంలో భూమి మీదకు రావడం చాలా నిజంగా అద్భుతమేనని చెప్పినట్లు పురుషోత్తం పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. తాము పెంచుకున్న కుక్కను తాను బ్రతికించినట్లు నమించిదని పురుషోత్తంనాయుడు చెప్పినట్లు తెలుస్తోంది. అప్పుడప్పుడు కళ్లు ఎర్రగా చేయడం.. వెంటనే మామూలు స్థితికి రావడంతో వారు కూడా నమ్మేశారు. ఇక చెల్లెలు సాయి దివ్య నిమ్మకాయలు తొక్కి దెయ్యం పట్టిందని భయపడటంతో ఆత్మహత్య చేసుకోవాల్సిందిగా అలేఖ్యనే ఉసిగొల్పినట్లు తెలుస్తోంది. చెల్లికి పట్టిన దైయ్యం వదలాలి అంటే డంబెల్ తో కొట్టి చంపాలని సూచించినట్లు.. నేనే పునర్జన్మ ప్రసాదిస్తానని వారిని నమ్మించి హత్య చేయించినట్లు సమాచారం