Weather Report: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
Weather Report: సముద్రమట్టానికి 5.8కిలోమీటర్ల ఎత్తులో విస్తరించిన ఉపరితల ఆవర్తనం
Weather Report: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం..సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. వీటి ప్రభావంతో ఏపీలో ఈరోజు చెదురు, ముదురు వర్షాలు..రేపు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50కిలోమీటర్ల వరకూ ఈదురు గాలులు వీస్తాయనీ..మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.