Nara Lokesh: రేపు ఢిల్లీ నుంచి విజయవాడకు లోకేష్
Nara Lokesh: సీఐడీ విచారణకు హాజరుకానున్న లోకేష్
Nara Lokesh: రేపు ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడ రానున్నారు నారా లోకేష్. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణకి హాజరుకానున్నారు. సెప్టెంబర్ 30న ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో CRPC 41-A కింద ఢిల్లీలో లోకేష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీలో రాష్ట్రపతి, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధుల దృష్టికి చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని తీసుకెళ్లారు లోకేష్. పార్లమెంట్ గాంధీ విగ్రహం, రాజ్ ఘాట్ దగ్గర, టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్‌తో కలిసి లోకేష్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.