తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ
Lok Sabha 2024 Polls Nominations: ఉ. 11 నుంచి మ.3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ
Lok Sabha 2024 Polls Nominations: ఏపీలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధులు ఆయా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఒక్కో అభ్యర్ధి గరిష్టంగా నాలుగు సెట్లను దాఖలు చేయవచ్చని, ఒక అభ్యర్ధి ఏదైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. మోడల్ కోడ్ అమల్లో భాగంగా అభ్యర్ధుల ఊరేగింపులను, నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాలను సైతం వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు.
అభ్యర్థుల నామినేషన్ల విషయానికొస్తే.. 25 వ తేదీ ఉదయం 10 గంటల ముప్పై నిమిషాలకు సీఎం జగన్ నామినేషన్ వేయనున్నారు. 22న కొడాలి నాని, బొత్స ఝాన్సీ,బొత్స సత్యనారాయణ, 23న నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, 24 న నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ వేయనున్నారు.