Lockdown: సంపూర్ణ లాక్ డౌన్ దిశగా ఏపీ!

Lockdown: పాజిటివిటీ రేటు పదిశాతం దాటితే పది శాతం దాటితేనే లాక్ డౌన్ విధించాలని ఐసీఎంఆర్ సూచిస్తోంది.

Update: 2021-05-14 03:51 GMT

Complete Lockdown:(File Image)

 Lockdown: ఏపీలో కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ వేవ్ కోరలు చాస్తోంది. దీని పరిష్కారం సంపూర్ణ లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం అని ఏపీ సర్కార్ భావిస్తోందా అంటే అవును అనే సమాధానం వస్తోంది. ఇలాంటి సమయంలో కర్ఫ్యూ కన్నా.. లాక్ డౌనే మేలు అనే అదికారులు భావిస్తున్నట్టు సమాచారం. సీఎం జగన్ కు కూడా అధికారులు ఇదే విషయం చెప్పినట్టు తెలుస్తోంది. సంపూర్ణ లాక్ డౌన్ లేకుంటే కేసులు కంట్రోల్ కావడం కష్టమే అని భావిస్తున్నారు. ఏపీలో వైరస్ వ్యాప్తి చాలా ఉదృతంగా కనిపిస్తుంది. ఇక్కడి పరిస్థితిపై వైద్య నిపుణులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్నీ బంద్ చేస్తున్నారు. అత్యవసరమైన మెడికల్ తదిరత అవసరాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. వారం నుంచి ఈ నిబంధనలు అమలు అవుతున్నా.. కరోనా మాత్రం కట్టడి కావడం లేదు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు పెరుగుతున్న కేసులు, మందుల కొరత, వ్యాక్సిన్ల లేమి, ఆసుపత్రులలో దక్కని బెడ్లు, ఆక్సిజన్ అందక పోతున్న ప్రాణాలు, ప్రైవేట్ ఆసుపత్రుల నిలువు దోపిడీ ఇలా ఒక్కటేమిటి అన్నీ కలిసి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సహజంగా ఏ రాష్ట్రంలోనైనా నిర్వహించే పరీక్షలలో పాజిటివిటీ రేటు పదిశాతం దాటితే ప్రమాదకరంగా భావించాల్సి ఉంది. ఏపీలో ఇప్పటికే ఈ పాజిటివిటీ రేటు ఇరవై శాతానికి మించింది. ఐసీఎం ఆర్ పది శాతం దాటితేనే లాక్ డౌన్ విధించాలని సూచిస్తోంది. కానీ ఏపీలో మాత్రం పాజిటివ్ రేట్ 20 శాతం దాటుతోంది. ఏపీలోని 11 జిల్లాలలో పాజిటివిటీ 20 శాతానికి మించిందని నిర్ధారణవగా విశాఖ, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాలలో మరింత ఆందోళనకర ప్రమాద పరిస్థితులు ఉన్నాయి. దీంతో మరో 6 నుండి 8 వారాల పాటు రాష్ట్రంలో కర్ఫ్యూ కాకుండా.. లాక్ డౌన్ విధించాలని ఐసీఎంఆర్ సూచిస్తుంది.

ఏపీలో ఫీవర్ సర్వేలోనూ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. చాలా గ్రామాల్లో సగానికి పైగా జ్వరాలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. చాలామందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నా.. పరీక్షలు చేయించుకోవాడానికి ముందుకు రావడం లేదని గుర్తించినట్టు తెలుస్తోంది. అందరికీ పరీక్షలు నిర్వహిస్తే.. పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కరోనా బారిన పడి కోలుకున్నా అనేక వ్యాధులు చుట్టు ముడుతున్నాయి. ఉత్తరాదిన కలవరపెడుతోన్న బ్లాక్ ఫంగస్ వ్యాధి తెలంగాణకు కూడా వ్యాపించింది. ఇదే ఏపీ లో విజృంభిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News