Donkey Marriage: గాడిదలకు పెళ్లిన చేసిన గ్రామస్తులు.. ఎందుకంటే..?

Donkey Marriage: వర్షాలు కురవడం కోసం చాలా ప్రాంతాల్లో ప్రజలు రకరకాల ఆచారాలను పాటిస్తుంటారు.

Update: 2023-08-08 14:45 GMT

Donkey Marriage: గాడిదలకు పెళ్లిన చేసిన గ్రామస్తులు.. ఎందుకంటే..?

Donkey Marriage: వర్షాలు కురవడం కోసం చాలా ప్రాంతాల్లో ప్రజలు రకరకాల ఆచారాలను పాటిస్తుంటారు. కప్పలకు పెళ్ళిళ్ళు, గుళ్లల్లో విగ్రహాలకు అభిషేకాలు చేయడం వంటివి చూసే ఉంటాం. తాజాగా అనంతపురం జిల్లాలోనూ వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ అక్కడి ప్రజలు గాడిదలకు ఘనంగా పెళ్లి చేశారు. ఈ ఘటన వజ్రకరూర్ మండలం చాబాల గ్రామంలో చోటుచేసుకుంది. సకాలంలో వర్షాలు కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గ్రామస్థులు వాసుదేవ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా అత్యంత భక్తి శ్రద్ధలతో గాడిదలకు ఘనంగా పెళ్లి చేశారు. అనంతరం ఊరేగింపు నిర్వహించారు. అనంతపురం జిల్లాలో వర్షాలు లేక పంటలు ఎండిపోతుండటంతో...గాడిదలకు పెళ్లి చేస్తే వర్షాలు బాగా కురుస్తాయని గ్రామస్థుల విశ్వాసం. ఈ గాడిదల పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News